కాపు ఉద్యమనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మానాభం క్యాన్సర్‌తో బాధపడుతున్నారట.. ఈ విషయం తెలిసి.. తన తండ్రిని కలిసేందుకు వెళ్లిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతిని అడ్డుకున్నారట కుటుంబ సభ్యులు.. ముద్రగడను కలిసేందుకు ఆయన కుమారుడు గిరి నిరాకరించాడట.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి..
నేను కులాలను కలిపేవాడిని, పార్టీలను కలిపేవాడిని, కుటుంబాలను వేరు చేస్తానా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతాను తప్పా వేరు చేయనని స్పష్టం చేశారు.
మరాఠీ నటి, సమీర్ వాంఖడే భార్య క్రాంతి రెడ్కర్ వాంఖడే (Kranti)కు పాకిస్థాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో భయాందోళన చెందిన ఆమె పోలీసులను ఆశ్రయించారు.