ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవం అద్భుతంగా కొనసాగుతోంది.. దీపాల కాంతులతో ఇల కైలాసాన్ని తలపిస్తోంది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని భక్తిలో మునిగిపోతున్నారు. రోజుకు ఒక కార్యక్రమంతో కోటి దీపోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న ఈ దీపయజ్ఞంలో ప్రతీ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కోటి దీపోత్సవంలో భాగంగా.. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది.