Koti Deepotsavam 2023 10th Day: ఎన్టీవీ, భక్తి టీవీ కోటిదీపోత్సవం అద్భుతంగా కొనసాగుతోంది.. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న ఈ దీపయజ్ఞంలో ప్రతీ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఇక, ఈ రోజు కోటి దీపోత్సవం వేదికగా ఒంటిమిట్ట కోందరాముని కల్యాణోత్సవం జరగనుంది.. ఇప్పటికే తొమ్మిది రోజుల పాటు సాగిన కోటిదీపోత్సవం వేదిక.. ఈ రోజు శ్రీరాముని రాకతో మరింత వెలుగులు నింపనుంది.
కోటిదీపోత్సవంలో 10వ రోజు కార్యక్రమాలు..
* నేడు రామభక్తి సామ్రాజ్యాన్ని తలపించనున్న ఇల కైలాసం
* కోటి దీపోత్సవ వేదికపై ఒంటిమిట్ట రామయ్య, కొండగట్టు అంజన్న సాక్షాత్కారం
* సకలాభీష్టప్రదాయకం భక్తులచే ఆంజనేయస్వామికి కోటితమలపాకుల అర్చన
* కమనీయం కడు రమణీయం శ్రీ ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం
* హనుమంత వాహనంపై జనకీరాముల వైభోగం
* కంచి కామాక్షి, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనభాగ్యం
* ఇస్కాన్ బృందం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మహాభిషేకం
* ఇస్కాన్ విశాఖపట్నం మాతా నితాయి సేవని అనుగ్రహభాషణం
* బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనామృతం
* అబ్బురపరిచే కళాసంబరాలు, అంబరాన్నంటే మహానీరాజనాలు
* కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు
ఇలా ఎన్నో విశేషాలకు వేదికైన కోటిదీపోత్సవానికి భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. భక్తులకు పూజా సామగ్రిని ఉచితంగా అందజేయడం జరుగుతోంది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే దీప యజ్ఞంలో పాల్గొనండి..