ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన 'ఆర్గానిక్ మామ - హైబ్రిడ్ అల్లుడు' చిత్రం మార్చి 3న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొని సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేసింది.
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పుడు మాటల రచయితగానూ మారిపోయారు. తన తాజా చిత్రం 'ఆర్గానిక్ మామ - హైబ్రీడ్ అల్లుడు'కు ఆయనే సంభాషణలు సమకూర్చుకున్నారు. ఈ సినిమా మార్చిలో జనం ముందుకు రాబోతోంది.