కొండపల్లి చైర్మన్ ఎన్ని వాయిదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా విధ్వంసం సృష్టించి వాయిదా వేయించడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన అన్నారు. ఎన్నిక నిర్వహణ రాకపోతే ఎస్‌ఈసీ, డీజీపీలు తప్పుకోవాలని ధ్వజమెత్తారు. ఎన్నిక అడ్డుకోవడమెందుకు.. వైకాపా వారినే చైర్మన్ చేయండి అంటూ మండి పడ్డారు. టీడీపీ సభ్యులను లోబర్చకోని కొండపల్లిలో పాగా వేయాలని చూస్తున్నారన్నారు. కౌన్సిల్ కార్యాలయంలోకి సంబంధం లేని…
ఇటీవలే ఏపీలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 నగరపంచాయతీ, గ్రామపంచాయతీల ఎన్నికల జరిగిన విషయం తెలిసింది. అయితే కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో 29 స్థానాలు ఉండగా 14 స్థానాల్లో వైసీపీ 15 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే 16 సభ్యుల కోరం ఉంటేనే చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ కార్యాలయం వద్దకు నిన్న టీడీపీ, వైసీపీ శ్రేణులు చేరుకున్నారు.…