టీటీడీ శుభవార్త చెప్పింది. కొండగట్టు అంజన్న భక్తుల కల త్వరలో నెరవేరనుంది. భక్తుల కోరిక మేరకు 100 గదుల నిర్మాణానికి టీటీడీ ముందుకు వచ్చింది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్థల పరిశీలన చేపట్టారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు ఆలయ అర్చకులు వేందమంత్రోత్చరణలతో ఆశీర్వచనం చేశారు. అయితే.. ఏపీలో ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. వారాహి వాహనానికి పూజ చేయించేందుకు పవన్ కల్యాణ్…