కోనసీమ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ భోజన ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. గోదావరి జిల్లాలకే ప్రత్యేకమైన సంప్రదాయ వంటకాలు, నోరూరించే పిండివంటలతో ఈ ఉత్సవం ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని కూడా పంచుతోంది. పండగ సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న పర్యాటకులతో ఆత్రేయపురం సందడిగా మారింది. ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణ ‘ఆత్రేయపురం పూతరేకులు’. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ పూతరేకులను ఇక్కడ ప్రత్యేక స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్నారు. డ్రై…