Fire Accident: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా…