కోనసీమలో క్రాప్ హాలీడేపై అధికారులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. దాంతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారు. గత ఏడాది ఇచ్చినట్లే హామీలు ఇచ్చి అమలు చేయకపోతే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని రైతులు చెబుతున్నారు. దాంతో కోనసీమలో సాగుపై సస్పెన్స్ కొనసాగుతోంది. కోనసీమ జిల్లాలో దాదాపు 12 మండలాల్లో రైతులు ఈ ఏడాది సాగు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా డ్రైన్లు సమస్యతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్…