వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి అనేక మంది మాజీ మంత్రులు, నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో నిరూపించిన వ్యక్తి వైఎస్ఆర్ అని, విజయమ్మ ఆహ్వానం మేరకు తప్పకుండా వస్తానని చెప్పానని, చెప్పినట్టుగానే వచ్చానని అన్నారు. ఉదయం 7గంటలకు తాను బయలుదేరి వచ్చినట్టు తెలిపారు. ఆత్మీయ సమావేశానికి ఎందుకు వెళ్లకూడదని కాంగ్రెస్ ఆదేశాలు ఇచ్చిందో తెలియదని అన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్యక్తి…