ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్, సతీమణి సైరా భాను విడిపోతున్నారు అనే వార్త సినీ వర్గాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. 29 ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి ముగింపు పలికి విడాకులు తీసుకుంటున్నారు రెహమాన్ దంపతలు. AR రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ఆమె తరుపు న్యాయవాది ప్రకటించారు. వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని తీసుకున్న ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని…