Jyothika: ముద్దుగా బొద్దుగా ఉన్నా, నటనతోనూ, నర్తనంతోనూ మురిపించారు జ్యోతిక. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్ళాడిన తరువాత కూడా తనకు తగ్గ పాత్రలలో ఆమె నటిస్తూ అలరిస్తున్నారు. తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి 'ఠాగూర్'తో తొలిసారి మెరిసింది జ్యోతిక. తరువాత జ్యోతిక నటించిన అనేక అనువాద చిత్రాలు తెలుగువారిని ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు జ్యోతిక.