Neet Exam: నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని కొందరు విద్యార్థినుల లోదుస్తులు విప్పించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. జూలై 17న కొల్లాం జిల్లా ఆయుర్‌లో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినులు అవమానానికి గురయ్యారు. మార్థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తనిఖీల సమయంలో కొందరు సిబ్బంది అమ్మాయిల లోదుస్తులు విప్పించారు. పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు బ్రా తీసి వెళ్లాలంటూ ఆదేశించారు. ఈ ఘటనపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల లో దుస్తులు…