కోల్‌కతా లా కాలేజీ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగించడానికి ఏసీపీ ప్రదీప్ కుమార్ ఘోషల్ పర్యవేక్షణలో 5 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఇకపై ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. కాగా.. దక్షిణ కోల్‌కతాలోని ఓ లా కాలేజీ క్యాంపస్‌లో జూన్ 25న మొదటి సంవత్సరం విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.