పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బీజేపీ తలపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బెంగాల్ రణరంగాన్ని తలపించింది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయిలో చెలరేగాయి. నడి రోడ్లపై రాళ్లు రువ్వడం, కట్టెలతో దాడి చేసుకోవడం, టార్గెట్ చేసుకుని దాడి చేయడం వంటివి చాలా చోట్ల కనిపించాయి.