షాహునగరి కొల్లాపూర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కొల్హాపూర్ కుస్తీ, బెల్లం, ఆహార సంస్కృతి, కొల్హాపురి చెప్పులు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్ తారల వరకు అందరూ కొల్హాపురి చెప్పులు వేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇప్పుడు ఈ కొల్హాపురి చప్పల్ పాకిస్థాన్‌లోనూ క్రేజ్‌గా మారింది. ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా పాకిస్థాన్ నుంచి డిమాండ్ భారీగా పెరిగింది. ఇక్కడి వ్యాపారులు పెద్ద మొత్తంలో చెప్పులను పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నారు.