Vizianagaram YCP Politics: విజయనగరం జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. నేతల మధ్య పోరు కన్నా.. అది సామాజికవర్గాల రణంగా మారడంతో మరింత వేడెక్కుతోంది. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేరు చెబితే విజయనగరం బీసీ నేతలు రుస రుసలాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కోలగట్లకు కాకుండా బీసీలకు వైసీపీ టికెట్ కేటాయించాలని స్వరం పెంచుతున్నారు అధికారపార్టీలోని ఆ వర్గం నాయకులు. మూడు నెలలుగా ఇదే పెద్ద చర్చగా ఉంది. ఏ కార్యక్రమం చేపట్టినా…