టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్‌ఫ్లాప్ అయిందని కామెంట్స్ చేశారు. కానీ ప్రచారం మాత్రం ఆర్భాటంగా చెప్పుకున్నారన్నారు. సత్తెనపల్లి సభకు జనం రాకపోయినా అద్భుతం అనడం చంద్రబాబు ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు.