ఇటీవల తానా 2025 - 2027 ప్రెసిడెంట్ గా ఎన్నికైన నరేన్ కు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసిలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో ఆయన ఇంటి వద్ద ఆత్మీయ మిత్రుల మధ్య అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ.. విద్యావేత్త, సౌమ్యుడు అయిన నరేన్ తన కార్యదక్షతతో తానా ఖ్యాతిని మరో స్థాయికి చేర్చి ఇనుమడింపచేయగలడని హర్షం వ్యక్తం చేశారు.