ఓఆర్ఆర్ నుంచి కోదాడ వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. కారు వెనుకనుండి ఢీకొట్టింది లారీ. వాళ్లని హాస్పటల్ కు తరలించే సమయంలో మరో కారు ఆగింది. అంతేకాదు, ఆ కారు వచ్చి ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. గాయపడ్డవారు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.…