అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఓడించి తీరుతానని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్.శర్మ పేర్కొన్నారు. ఉత్కంఠ పోరు మధ్య అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్.శర్మ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట పెద్ద ఎత్తున స్థానిక పార్టీ శ్రేణుల తరలివచ్చారు.