న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయంతో ఇబ్బంది పడ్డాడు. వెస్టిండీస్ పేసర్ జైడన్ సీల్స్ వేసిన బంతి రాహుల్‌కు తాకరాని చోట గట్టిగా తాకింది. దాంతో అతడు మైదానంలోనే కుప్పకూలి.. నొప్పితో వివవిల్లాడాడు. టీమిండియా ఫిజియో మైదానంలోకి పరుగెత్తుకొచ్చి ప్రథమ చికిత్స చేశాడు. కాసేపటికి రాహుల్ నొప్పి నుంచి ఉపశమనం పొందాడు. ఆపై బ్యాటింగ్ కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో…