కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి శనివారం జూబ్లీహిల్స్‌లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఫిల్మింనగర్‌లో ఏర్పాటు చేసిన దక్కన్ కిచెన్ ఫైన్ రెస్టారెంట్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రజలెవరూ గత సంవత్సరకాలంగా బయటకు రావడంలేదని.. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజలు మెచ్చే అభిరుచులతో దక్కన్ కిచెన్ ఫైన్…
హుజురాబాద్ లో బీజేపీ విజయం ప్రజల విజయం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు నీతికి, న్యాయానికి మద్దతుగా నిలిచారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ కి మద్దతు ఇచ్చిన హుజురాబాద్ ప్రజానీకానికి, నా తరపున కేంద్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు. ఖర్చుతో కూడుకున్న ఎన్నికల్లో పాలక పార్టీ మభ్యపెట్టినా, వాటిని లెక్క చేయకుండా ప్రజలు బీజేపీ కి ఓటు వేసి గెలిపించారు. హుజురాబాద్ ప్రజలు చరిత్ర తీరగరాశారు.…
దీపావళి సందర్భంగా నవంబర్ 3న అయోధ్యలో జరిగే దీపోత్సవ్‌కు యోగి ఆదిత్యనాథ్ గౌరవనీయమైన పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని ఆహ్వానించారు. అయోధ్య నగరం అంతటా 12 లక్షల దీపాలు (మట్టి దీపాలు) వెలిగించి ఈ వేడుక రికార్డు సృష్టించనుంది. దీపావళి రోజున సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి ఘాట్ వద్ద సుమారు 9 లక్షల దీపాలు, నగరంలోని వివిధ ప్రదేశాలలో 3 లక్షల దీపాలను…
హుజురాబాద్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నారు. నేతలు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు హద్దులు దాటుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. టీఆర్‌ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ ఉద్యమ ద్రోహులకు, ఉద్యమ వ్యతిరేకులకు అడ్డాగా మారిందన్నారు. నాడు తెలంగాణ పోరాటాన్ని అణచి వేసిన వాళ్లే ఉద్యమకారులను వేధించిన వాళ్లే నేడు కేసీఆర్ దగ్గర కనిపిస్తున్నారన్నారు. కేసీఆర్‌కైనా సామాన్య కార్యకర్తకు అయినా, తన కైనా ఎలక్షన్ కమిషన్ రూల్స్…
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో శనివారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకరమైనదని అభివర్ణించారు. ఎవరు ఎమ్మెల్యే ఉండాలి అనేది కాదు… ఈ రాష్ట్రం ఎటు పోవాలి అనే దాని కోసం ఈ ఎన్నిక జరుగుతోందన్నారు. ఇంతమంది జనం చూసిన తర్వాత ఇంకా ఎన్నిక నిర్వహించడం అవసరమా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ జనం చూసి కేసీఆర్…
తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలకు సిద్దమవుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించేందుకు ఇల్లందుకుంట మండలం సిరిసేడుకు చేరుకున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు, బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది. ఈ ఘటనలోనే ఓ టీఆర్‌ఎస్ కార్యకర్తల ఎస్సై కాలర్ పట్టుకున్నాడు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి.. అనుమతి తీసుకొనే ప్రచారం…
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. కేంద్రమంత్రి లాంటి పదవిలో ఉండి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచిందని తాను నిరూపిస్తానని ఆయన పేర్కొన్నారు. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్, సర్ ఛార్జ్ పేరుతో పెట్రోల్‌పై రూ.22.47ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నులు పెంచిందని హరీష్…
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఈనెల 30న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్యే వుంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం బుజునూరు గ్రామంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈటల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక హుజురాబాద్ అన్నారు. ఏడేళ్ళుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు. కేసీఆర్ డబ్బులను నమ్ముకొని ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగే…
అతి ప్రాచీన కట్టడం అయిన రుద్రేశ్వర దేవాలయము అభివృద్ధికి పాటుపడతానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో అనేక కట్టడాలు ఉన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయాయన్నారు. కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యత తీసుకున్న తరువాత.. విద్యావతి తన దగ్గరకు వచ్చి మొదటి విషయం చెప్పిన అంశం రామప్ప దేవాలయం గురించే అన్నారు. చాలా దేశాలు రామప్ప దేవాలయం ను వ్యతిరేకించాయని, అయితే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ దేశాలు అయితే రామప్ప గుర్తింపు కు అడ్డుకున్నాయో వాటి…
రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుకగా అభివర్ణించిన ఆయన.. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించ కూడదనే స్ఫూర్తితో చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయ దశమిని జరుపుకుంటారని తెలిపారు.. ఇక, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో జీవించేలా తెలంగాణ ప్రజలను దీవించాలని దుర్గామాతను దసరా సందర్భంగా ప్రార్థించినట్టు తెలిపారు సీఎం కేసీఆర్.. మరోవైపు.. తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రజలంతా…