G. Kishan Reddy: వ్యక్తుల కోసం కుటుంబం కోసం పనిచేసే పార్టీ బీజేపీ కాదు...దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడుతూ,
Jammu Kashmir: కేంద్రమంత్రి కిషన్రెడ్డితో పాటు ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ను జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్లుగా బీజేపీ అధిష్టానం నియమించింది.
Ponnam Prabhakar: కేసీఆర్ ట్యూనింగ్ చేస్తే.. కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లులేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) ఫలాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి లేఖ రాశారు. గ్రామీణ భారతదేశంలోని ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ పథకాన్ని 2016 లో ప్రారంభించిందన్నారు. పథకం ప్రారంభ సమయంలో…
రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తెలంగాణ విద్యావ్యవస్థకు శాపంగా మారిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తాజాగా ప్రకటించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ లో రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్య సంస్థల పనితీరు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఉన్నత విద్యలో మాత్రమే కాదు, ప్రాథమిక విద్యలోనూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు నానాటికి తీసికట్టుగా ఉందని ఇటీవల విడుదల చేసిన ఉమ్మడి…
భక్తులకు శుభవార్త.. విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ఆలయ నిర్వహాకులు శుభవార్త తెలిపారు. సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ కొండపైనున్న విష్ణు పుష్కరిణిలో భక్తులకు సంకల్ప స్నానం ఆచరించే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రావణ మాసం మొదటి ఆదివారం యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య చేతుల మీదుగా అధికారులు విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించారు. ఆలయ అధికారులు…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్ లోని తమ నివాసంలో కిషన్ రెడ్డి దంపతులు జాతీయ జెండాను ఎగురవేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. Mamata Banerjee: ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్య కేసును వేగంగా ఛేదించాలి..…
సనత్ నగర్ అసెంబ్లీ బన్సీలాల్ పేట, న్యూ బోయి గూడలో జరిగిన బోనాల పండుగ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా బన్సీ లాల్ పేట్ చాచా నెహ్రు నగర్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని సి-క్లాస్ బన్సీలాల్పేట – శ్రీ బండ మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. తర్వాత బన్సీలాల్ పేట శ్రీ రేణుకా ఎల్లమ్మ, శ్రీ నల్ల పోచమ్మ ముత్యాలమ్మ బోనాల…
ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మాకే నామ్’ పిలుపు మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఢిల్లీలోని తన నివాసంలో తన మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో మొక్కలు నాటుతు.. అమ్మను గౌరవించుకోవాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. మొక్క నాటిన అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలన్న ప్రధాని…
Kishan Reddy: దేశ ఆర్థికాభివృద్ధిలో గనుల రంగం పోషిస్తున్న పాత్ర కీలకమని రానున్న రోజుల్లో దేశం గనుల రంగంలో స్వయంసమృద్ధి సాధించే దిశగా మరింత కృషి జరగాలని కేంద్ర గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నది మైనింగ్ పరిశ్రమే అని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో.. దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో, సుస్థిరాభివృద్ధి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేస్తున్న 68 సంస్థలకు కేంద్రమంత్రి 5…