Maldives Tourism Threat: కొత్తగా పెళ్లి చేసుకున్న చాలా మంది నూతన దంపతుల హనీమూన్ స్పాట్, డైవింగ్ ఔత్సాహికులకు ఒక ప్రధాన గమ్యస్థానం మాల్దీవులు. ఈ అందమైన ప్రాంతం త్వరలో మాయం కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలు ఈ హిందూ మహాసముద్ర ద్వీపసమూహం తీరాలను తాకుతున్నాయి. ముంచుకొస్తున్న ఈ సముద్ర మట్టాల కారణంగా ఈ 1,200 పగడపు దీవులు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. మాల్దీవుల ఉనికి మాత్రమే కాకుండా తువాలు,…