Pre-wedding shoots harmful for brides: ఈ మధ్య కాలంలో పెళ్లి కన్నా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లకే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. చిత్రివిచిత్రంగా ప్రీ వెడ్డింగ్ షూట్లు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి కాంట్రవర్సీలకు, ప్రమాదాలకు కూడా కారణం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల గురించి ఛత్తీస్‌గఢ్ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ కిరణ్మయి నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.