కిరణ్ లోవ, లక్ష్మీ కిరణ్, హరీష్ బొంపల్లి, మంజీర ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఒ.సి.’. విష్ణు శరణ్ బొంపల్లి దీనికి నిర్మాత. కిరణ్ – విష్ణు దర్శకులు. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, మునిరాజ్ గుత్తా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సత్య మాస్టర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కిరణ్…