విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో అత్యంత పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ లో ఆయన కనిపించిన తీరు అందరినీ కట్టిపడేసింది. విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే ఒక స్పెషల్ రోల్ లో కనిపించనుంది. ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా…