విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో అత్యంత పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ లో ఆయన కనిపించిన తీరు అందరినీ కట్టిపడేసింది. విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే ఒక స్పెషల్ రోల్ లో కనిపించనుంది. ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ గా ఉంది కింగ్‌డమ్.
తెలుగు రాష్ట్రాల్లో కింగ్‌డమ్ కు భారీ ఎత్తున బిజినెస్ జరిగింది. సితార వారి రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాకు అడ్వాన్స్ లు భారీగానే ఇచ్చారు. అటు కన్నడ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. తమిళ్ కూడా క్లోజ్ అయింది. కానీ హిందీ రిలీజ్ ను ఆపేసారు మేకర్స్. నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఇక కేరళలో మాత్రం కింగ్‌డమ్ కేరళ రైట్స్ విషయంలో బయ్యర్స్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. విజయ్ దేవరకొండ కొంత కాలంగా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ ఇస్తున్నాడు. కనీసం మినిమం కూడా రికవరీ కావడం లేదు. దాంతో కింగ్‌డమ్ కు మేకర్స్ అడిగిన ధరకు కొనుగోలు చేసేందుకు సుముఖంగా వ్యక్తం చేస్తున్నారు బయ్యర్లు. ప్రస్తుతం కింగ్‌డమ్ నిర్మాతలతో బేరాలు సాగుతున్నాయి. ఒకవేళ అనుకున్న ధర రాకుంటే నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేయాలనీ కూడా ఆలోచన చేస్తున్నారు. ఎలాగూ కేవలం రిలీజ్ వరకు అంటే చేసే పెట్టేందుకు దుల్కర్ సల్మాన్ వే ఫారర్ ఫిల్మ్స్ ఉండనే ఉంది.