వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం విండీస్ జట్టుకు వన్డే కెప్టెన్‌గా ఉన్న పొలార్డ్ 15 ఏళ్లుగా తన దేశానికి ఆడుతున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. విండీస్ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం తన జీవితంలో మరపురాని అనుభూతిగా పొలార్డ్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా టీ20, టీ10 లీగ్‌లకు అందుబాటులోనే ఉంటానని తెలిపాడు. అయితే ఐపీఎల్ జరుగుతున్న వేళ పొలార్డ్ తన ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ను ప్రకటించడం క్రికెట్ వర్గాలను…