తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ కలిశారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాంత్.. తన వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు. శ్రీకాంత్, ఆయనకు కాబోయే భార్య శ్రావ్య వర్మలు సీఎంకు శుఖలేఖను అందజేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 2018లో పద్మశ్రీ అందుకున్నాడు. 2015లో అర్జున అవార్డు సైతం అతడికి దక్కింది. కెరీర్ ఆరంభంలో అనూహ్య…