Kia Carens Clavis EV: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా (KIA) తన కొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు Carens Clavis EV ను భారత మార్కెట్లో ఈ మధ్యనే లాంచ్ చేసింది. ఈ కారు బుకింగ్స్ నేటి (జూలై 22) నుంచి ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 25,000 ముందస్తు చెల్లింపుతో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ వేరియంట్ ఇటీవలే విడుదలైన ICE వేరియంట్ Carens Clavis ఆధారంగా తయారు చేయబడింది.…