ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో లోక్‌సభ సెక్రటేరియట్ ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సినీ నటి, బీజేపీ నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుఖుష్బూ సుందర్ గతంలో ప్రధాని మోదీ ఇంటి పేరుపై చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.