Adivasi Festival : పుష్యమాసం పౌర్ణమి వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లా సంప్రదాయాలకు పునాదులు వేసిన ఆదివాసీ సంస్కృతి మరోసారి పుంజుకుంటుంది. ఈ జిల్లా అడవుల్లో ప్రతి క్షణం ఆధ్యాత్మిక శోభను చాటి చెప్పే అనేక జాతరలు నిర్వహించబడతాయి. అవి సాహసాలకు, సంప్రదాయాలకు, ఆచారాల పరిరక్షణకు నిలయంగా నిలుస్తాయి. ఇందులోని తొడసం తెగ వారు తమ ఆరాధ్యదైవం ఖందేవుని మహాపూజను అత్యంత ఘనంగా నిర్వహిస్తూ తమ వంశం సంప్రదాయాలను తూచ తప్పకుండా పాటిస్తున్నారు. పుష్యమాసం పౌర్ణమి రోజున ఖందేవుని…