రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి, చైతన్య దీప్తి అల్లూరి సీతారామరాజు 98వ వర్థంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉమ్మడి రాష్ట్రాల క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరికి ఘన నివాళులర్పించారు. ఆనాటి స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినా పోరాటాన్ని…
కోకాపేట్, ఖానామెట్ భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది.. కనక వర్షమే కురిసింది.. అయితే, ఖానామెట్ భూముల వేలంపై కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.. ఖానామెట్‌లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఖనామెట్‌లో గొల్డెన్ మైల్‌లోని 15 ఎకరాలను వేలం వేశారు.. అయితే, 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం కూడా ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టగా.. ఆ స్మశానవాటిక వేలాన్ని ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించారు స్థానికులు……
భూముల వేలం తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది… నిన్న కోకాపేటలో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం రాగా.. ఇవాళ సైబరాబాద్‌లో హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్‌లోని భూముల వేలానికి విశేష స్పందన లభించింది. ఎంఎస్‌టీసీ ద్వారా నిర్వహించిన ఈ వేలంలో మొత్తం అయిదు ప్లాట్లను విక్రయించారు. 14.91 ఎకరాలకు గాను రూ. 729.41 కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు అధికారులు.. గరిష్టoగా ఎకరానికి రూ.55 కోట్ల ధర పలకగా.. 15 ఎకరాలకు అవరేజ్ గా…