Donald Trump: ఖలిస్తాన్ ఉగ్రవాది, అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ నిజ్జర్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణతో భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారిపై కేసు నమోదు చేసిన ఫెడరల్ ప్రాసిక్యూటర్ డామియన్ విలియమ్స్‌ని కొత్తగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఇతడి స్థానంలో న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌కి డిస్ట్రిక్ట్ అటార్నీగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) మాజీ ఛైర్మన్ జే క్లేటన్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ గురువారం ప్రకటించారు
ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు అమృతపాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దుబాయి రాక ముందు ఒక సాధారణ భారతీయుడు అయిన అమృత్‌పాల్ సింగ్.. కనీసం స్వీయ మతాచారాలను కూడా పాటించని వ్యక్తి కరుడుగట్టిన మతోన్మాదిగా మారిపోయాడు. ఉపాధి కొరకు గల్ప్‌కు వచ్చిన ఒక సాదాసీదా గ్రామీణ యువకుడు సామాజిక మాధ్యమాల పుణ్యమా అంటూ ఏ విధంగా దేశభద్రతకు సవాల్ విసురుతున్నాడో పంజాబీ ప్రవాసుడు అమృతపాల్ సింగ్ ఉదంతాన్ని గమనిస్తే అర్థమవుతుంది.
వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్‌పాల్ సింగ్ దేశం నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నందున సరిహద్దు భద్రతా దళం (BSF), సశాస్త్ర సీమా బల్ (SSB)కి కేంద్రం సందేశం పంపడంతో నేపాల్, పాకిస్తాన్‌తో సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి.
Amritpal Singh: పంజాబ్ లో హై అలర్ట్ నెలకొంది. పంజాబ్ వ్యాప్తంగా పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నేత అమృత్ పాల్ సింగ్ కోసం విస్తృతంగా వెతుకుతున్నారు. అతడిని పట్టుకునేందుకు నిన్న పంజాబ్ ప్రభుత్వం ఆపరేషన్ ప్రారంభించింది. నిన్న దొరికినట్లే దొరికి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పటు చేశారు. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెర్ సర్వీసులను షట్ డౌన్ చేశారు.…