హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఖలీల్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు. పాతకక్షల నేపథ్యంలోనే ఖలీల్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ కు ఖలీల్ మధ్య గత కొంత కాలంగా గొడవలున్నాయి. ఈ గొడవల కారణంగానే ఖలీల్ ను ఉస్మాన్ చంపేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.