నానక్‌రామ్ గూడలోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు.. నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఖాజగూడ చెరువులోకి మురుగు నీరు చేరకుండా కాలువ డైవర్షన్ పనులు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువు సుందరీకరణ పనులు స్పీడప్ చేయాలని దత్తత తీసుకున్న సంస్థను కోరారు.
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నేడు ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. చెరువు బఫర్ జోన్‌లోని నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బఫర్ జోన్‌లోని 4 ఎకరాల ఖాళీ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను హైడ్రా కూల్చివేసింది. ఆ స్థలంలో ఉన్న వైన్స్‌ను తక్షణమే ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు ఆదేశించారు. కూల్చివేతల సందర్భంగా అధికారులకు భారీ బందోబస్తు చేపట్టారు. ఇటీవల భగీరథమ్మ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. భగీరథమ్మ చెరువు…