అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు రంగనాథ స్వామి తిరునాళ్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరునాళ్లకు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒకే సమయంలో వచ్చారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆపి కాసే ఆగి వెళ్లాలని సూచించారు. పెద్దారెడ్డి వెళ్లిపోయిన తర్వాత జేసీని అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసుతో జేసీ వాగ్వాదానికి దిగారు. పోలీసులు తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.…