పదేళ్లపాటు బెజవాడ ఎంపీగా పనిచేసిన కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున బెజవాడ ఎంపీగా వరుస విజయాలు సాధించారు కేశినేని నాని. 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరపున బరిలోకి దిగినా.. ఆయన సొంత సోదరుడు కేశినేని చిన్ని చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ పరాజయంతో తర్వాత అనేక సమాలోచనలు జరిపి చివరికి రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకు న్నట్టు కేశినేని…
బెజవాడ రాజకీయలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ప్రత్యక్ష రాజకీయాలనుంచి వైదొలుగుతున్నాను అంటూ ప్రకటించారు.. తనను రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నాని.. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు బెజవాడ మాజీ ఎంపీ.