Kerala: అంగన్‌వాడీ కేంద్రాల్లో పెడుతున్న ఉప్మాకు బదులుగా మాకు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలంటూ ఓ బుడ్డొడు చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ పిల్లాడి కోరిక ప్రకారం కేరళ రాష్ట్రంలోని అంగన్‌వాడీ మెనూనే మార్చేసింది అక్కడి ప్రభుత్వం.
Shine Tom Chacko : కేరళలో షైన్ టామ్ చాకో వ్యవహారం వివాదంగా మారింది. డ్రగ్స్ కేసుతో పాటు నటి విన్సీ చేసిన ఆరోపణలు షైన్ టామ్ ను చిక్కుల్లో పడేశాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. కానీ పోలీసుల విచారణలో మాత్రం తాను డ్రగ్స్ తీసుకున్నట్టు ఆయన ఒప్పుకున్నారు. ఈ ఘటనలపై తాజాగా కేరళ న్యాయశాఖ మంత్రి పి రాజీవ్ స్పందించారు. షైన్ టామ్ చాకో విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నామన్నారు.…
శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసి పోతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్ ఏర్పాడింది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపి వేస్తున్నారు.
హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆదివారం నారాయణగూడ ప్రాంతం మార్మోగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో అయ్యప్పస్వామి మహా పడిపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస వసతులు కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరారు. ఏర్పాట్ల లేమి కారణంగా తెలుగు రాష్ట్రాల భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.