Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. ఎన్డీయేకు లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీల బలం ఉండటంతో బిల్లు సులభంగానే పాస్ అవుతుంది. అయితే, బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే, కేరళలోని ప్రముఖ కాథలిక్ చర్చి నడిపే దినపత్రిక వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఆర్టికల్ ప్రచురించింది. ఈ బిల్లుని ‘‘లౌకికవాదానికి కీలకమైన పరీక్ష’’గా అభివర్ణించింది. దీనిని వ్యతిరేకిస్తే మతపరమైన మౌలిక వాదాన్ని ఆమోదించినట్లు అవుతుందని…