కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పలు వరుస పేలుళ్లకు బాధ్యుడని పేర్కొన్న డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, హత్యా నేరాల కింద అతడిని సోమవారం అరెస్టు చేశారు.
Kerala Blast: కేరళ వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. మొత్తం 45 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.