పన్ను వ్యతిరేక నిరసనలతో కెన్యా రణరంగంగా మారింది. పార్లమెంట్ ముట్టడికి పెద్ద ఎత్తున ఆందోళనకారులు తరలిరావడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులు, భద్రతా సిబ్బంది నిరసనకారులపై టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులు, తుపాకీ కాల్పులకు పాల్పడ్డారు.
ప్రజల ఆందోళనలు, నిరసనలతో కెన్యా పార్లమెంట్ పరిసరాలు అట్టుడికింది. పార్లమెంట్‌లో కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టి మంగళవారం ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు.