మహానటి కీర్తి సురేష్ తెలుగులో చివరిగా కనిపించి రెండేళ్లు దాటిపోయింది. ‘భోళా శంకర్’ తర్వాత పెద్దగా కనిపించని ఆమె, ఇటీవల ‘ఉప్పు కప్పురంబు’ ద్వారా ఓటీటీలో ప్రేక్షకులను కలుసుకుంది. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో రీ-ఎంట్రీకి రెడీ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కొత్త ప్రాజెక్టులు సైన్ చేస్తూ బిజీ అవుతున్న కీర్తి, తాజాగా మలయాళ స్టార్ ఆంటోనీ వర్గీస్‌తో కలిసి ఓ కొత్త సినిమాలో నటించనుంది. రిషి శివ కుమార్ దర్శకత్వం వహించే ఈ…