BJP MP Pragya Thakur Named In Police Case For "Hindus, Keep Knives" Speech: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్(సాధ్వి ప్రజ్ఞా) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక శివమొగ్గలో రెచ్చగొట్టే ప్రకటన చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ జాగరణ వేదిక దక్షిణ ప్రాంత సదస్సులో మాట్లాడుతూ.. ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఈ భోపాల్ ఎంపీపై ఫిర్యాదు నమోదైంది. ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.