సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ సతీమణి శోభ కూడా చింతమడకలో ఓటు వేశారు. ఈ సమయంలో కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కేసీఆర్‌ను కలిసేందుకు చింతమడక గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు. ఓటు వేసిన అనంతరం మాజీ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతోంది. 65-70 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉంది’…
సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామానికి ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు రానున్నారు. తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు గులాబీ బాస్ ఓటేయనున్నారు. కేసీఆర్ చింతమడక గ్రామానికి సమీపంలో హెలిప్యాడ్‌లో దిగి.. అక్కడి నుంచి కారులో వచ్చి ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో కేసీఆర్ దంపతులు ఓటు…