CM KCR: శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Review Meeting With Police Officers On Law and Order: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా హైదరాబాద్‌లో రెండ్రోజుల నుంచి ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ పరిణామాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్.. పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్, ఇతర పోలీసు అధికారులతో ప్రగతిభవన్‌లో కేసీఆర్ సమావేశమయ్యారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని.. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని కేసీఆర్ చెప్పారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.
ఇదిలావుండగా.. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. ఆ వర్గానికి చెందిన ప్రజలు నగరంలో నిరసనలకు దిగారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ర్యాలీలు చేపట్టారు. అలాగే.. బండి సంజయ్ అరెస్ట్, ఎమ్మెల్సీ కవితపై లిక్కర్‌స్కామ్ ఆరోపణలపై బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పరిణామాలు, శాంతిభద్రతలపై సీఎం ఆరా తీశారు. మరోవైపు.. పాతబస్తీలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా యాక్షన్ ఫోర్స్ బలగాలను దించారు.
Also Read
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ 'డెడ్ డ్రాప్' డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
- Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!