Off The Record: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు జోరుగా నడుస్తున్నాయి. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అన్న లెక్కల్లో ఎవరికి వారు మునిగితేలుతున్నారు. ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌లో దీనికి సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. తొలి విడతలో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 1144 చోట్ల గెలిచారు. ఈ నంబర్‌ని ఆ పార్టీ అస్సలు ఊహించలేదట. దీంతో మిగతా రెండు విడతల్లో జాగ్రత్తలు తీసుకుని సత్తా చాటాలనుకుంటున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో…