Telangana Jagruthi : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణ జాగృతి భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. జూన్ 4న బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద జరగనుంది. ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్‌పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ…
కాళేశ్వరం కుంగుబాటుపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో వికృత, వికార మైన విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.జ్యుడీషియల్ కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్ కు నోటీసులు పంపిస్తే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు..